Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

సంఖ్యాకాండము 1

Num 1:1  వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవ త్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను
Num 1:2  ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయిం చుము.
Num 1:3  ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.
Num 1:4  మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను.
Num 1:5  మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగారూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;
Num 1:6  షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు
Num 1:7  యూదా గోత్రములో అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను
Num 1:8  ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైననెత నేలు
Num 1:9  జెబూ లూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
Num 1:10  యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు
Num 1:11  బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను
Num 1:12  దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు
Num 1:13  ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారు డైన పగీయేలు
Num 1:14  గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు
Num 1:15  నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.
Num 1:16  వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.
Num 1:17  పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహ రోనులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదిని సర్వ సమాజమును కూర్చెను.
Num 1:18  ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబ ములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
Num 1:19  యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.
Num 1:20  ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి.
Num 1:21  షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు
Num 1:22  మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
Num 1:23  షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.
Num 1:24  గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:25  గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
Num 1:26  యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:27  యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.
Num 1:28  ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశ ము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:29  ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగువేల నాలుగువందల మంది యైరి.
Num 1:30  జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:31  జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మంది యైరి.
Num 1:32  యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:33  యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందల మంది యైరి.
Num 1:34  మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:35  మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.
Num 1:36  బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:37  బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి.
Num 1:38  దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:39  దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి.
Num 1:40  ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:41  ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.
Num 1:42  నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
Num 1:43  నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.
Num 1:44  వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహ రోనును తమ తమ పితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్క డుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించిన వారు. '
Num 1:45  అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు
Num 1:46  లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.
Num 1:47  అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.
Num 1:48  ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెనునీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు.
Num 1:49  ఇశ్రాయేలీ యుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.
Num 1:50  నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణము లన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయు లను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకర ణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసిన వారై యుందురు.
Num 1:51  మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.
Num 1:52  ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను.
Num 1:53  ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.
Num 1:54  యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీ యులు చేసిరి.

సంఖ్యాకాండము 2

Num 2:1  మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.
Num 2:2  ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.
Num 2:3  సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.
Num 2:4  అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.
Num 2:5  అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.
Num 2:6  అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.
Num 2:7  అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.
Num 2:8  అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగు వందలమంది.
Num 2:9  యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
Num 2:10  రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.
Num 2:11  అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.
Num 2:12  అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.
Num 2:13  అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది.
Num 2:14  అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.
Num 2:15  అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.
Num 2:16  రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.
Num 2:17  ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.
Num 2:18  ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారు డైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.
Num 2:19  అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.
Num 2:20  అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీ యేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.
Num 2:21  అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది.
Num 2:22  అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.
Num 2:23  అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.
Num 2:24  ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
Num 2:25  దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.
Num 2:26  అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.
Num 2:27  అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
Num 2:28  అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
Num 2:29  అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమా రులకు ప్రధానుడు.
Num 2:30  అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.
Num 2:31  దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
Num 2:32  వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.
Num 2:33  అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.
Num 2:34  అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్త మును చేసిరి. అట్లు వారు తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచు నుండిరి.

సంఖ్యాకాండము 3

Num 3:1  యెహోవా సీనాయికొండమీద మోషేతో మాట లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.
Num 3:2  అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.
Num 3:3  ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠిం చెను.
Num 3:4  నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
Num 3:5  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను నీవు లేవి గోత్రికులను తీసికొనివచ్చి
Num 3:6  వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము.
Num 3:7  వారు ప్రత్యక్షపు గుడా రము నెదుట మందిరపు సేవచేయవలెను. తాము కాపాడ వలసినదానిని, సర్వసమాజము కాపాడ వలసినదానిని, వారు కాపాడవలెను.
Num 3:8  మందిరపు సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీ యులు కాపాడవలసిన దంతటిని, వారే కాపాడవలెను.
Num 3:9  కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారు లకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు.
Num 3:10  నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.
Num 3:11  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా
Num 3:12  ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.
Num 3:13  ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూ లును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.
Num 3:14  మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
Num 3:15  లేవీయుల పితరుల కుటుంబ ములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింప వలెను.
Num 3:16  కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించి నట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను.
Num 3:17  లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
Num 3:18  గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.
Num 3:19  కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
Num 3:20  మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.
Num 3:21  లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.
Num 3:22  వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందల మంది.
Num 3:23  గెర్షోనీ యుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను.
Num 3:24  గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు.
Num 3:25  ప్రత్య క్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు
Num 3:26  ప్రాకారయవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును.
Num 3:27  కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.
Num 3:28  ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి.
Num 3:29  కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.
Num 3:30  కహాతీయుల వంశముల పితరుల కుటుంబ మునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను.
Num 3:31  వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డ తెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.
Num 3:32  యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త.
Num 3:33  మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు.
Num 3:34  వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందల మంది.
Num 3:35  మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.
Num 3:36  మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణము లన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని
Num 3:37  దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.
Num 3:38  మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడ వలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.
Num 3:39  మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి, తమ తమ వంశ ములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది.
Num 3:40  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలు కొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతిమగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము.
Num 3:41  నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగ పిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలొ తొలిచూలియైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువు లను నా నిమిత్తము తీసి కొనవలెను.
Num 3:42  కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారి నందరిని లెక్కించెను.
Num 3:43  వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండు వేల రెండువందల డెబ్బదిమూడు.
Num 3:44  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
Num 3:45  నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీ యులు నా వారైయుందురు; నేనే యెహోవాను.
Num 3:46  ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.
Num 3:47  పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను.
Num 3:48  తులము ఇరువది చిన్న ములు. వారిలో ఎక్కువ మంది విమోచనకొరకు ఇయ్య బడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను.
Num 3:49  కాబట్టి మోషే లేవీయులవలన విడిపింప బడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను.
Num 3:50  పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను.
Num 3:51  యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడి పింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.

సంఖ్యాకాండము 4

Num 4:1  యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెల విచ్చెను
Num 4:2  నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను
Num 4:3  ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయిం చుము.
Num 4:4  అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్య క్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా
Num 4:5  దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి
Num 4:6  దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.
Num 4:7  సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱ బట్ట పరచి
Num 4:8  దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.
Num 4:9  మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి
Num 4:10  దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను.
Num 4:11  మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.
Num 4:12  మరియు తాము పరిశుద్ధస్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను.
Num 4:13  వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి
Num 4:14  దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.
Num 4:15  దండు ప్రయాణమైనప్పుడు అహరో నును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్ని టిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధ మైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడా రములో కహాతీయుల భారము.
Num 4:16  యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగాదీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము.
Num 4:17  మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
Num 4:18  మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి.
Num 4:19  వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియ మింపవలెను.
Num 4:20  వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.
Num 4:21  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
Num 4:22  గెర్షోనీయులను వారివారి పితరుల కుటుంబముల చొప్పు నను వారివారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము.
Num 4:23  ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పని చేయ చేరువారందరిని లెక్కింప వలెను.
Num 4:24  పనిచేయు టయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ;
Num 4:25  వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను
Num 4:26  మందిరము చుట్టును బలిపీఠము చుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధ మైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయ బడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను.
Num 4:27  గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోనుయొక్కయు అతని కుమారులయొక్కయు నోటిమాట చొప్పున జరుగ వలెను. వారు జరుపువాటి నన్నిటిని జాగ్రత్తగా చూచు కొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను.
Num 4:28  ప్రత్యక్షపు గుడా రములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతా మారు చేతిక్రింద నుండవలెను.
Num 4:29  మెరారీయులను వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను.
Num 4:30  ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను.
Num 4:31  ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభము లను
Num 4:32  దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభము లను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావ లసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువు లను పేర్ల వరుసను లెక్కింపవలెను.
Num 4:33  మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహ రోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.
Num 4:34  అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని
Num 4:35  యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి.
Num 4:36  వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది.
Num 4:37  ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి.
Num 4:38  గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని
Num 4:39  యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై సేనగా చేరువారందరు తమ తమ వంశముల చొప్పునను
Num 4:40  తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది.
Num 4:41  ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.
Num 4:42  మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు
Num 4:43  అనగా ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్య క్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు
Num 4:44  అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది.
Num 4:45  మెరారీ యుల వంశములలో లెక్కింపడినవారు వీరే; యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.
Num 4:46  మోషే అహరోనులు ఇశ్రాయేలీ యుల ప్రధానులును లెక్కించిన లేవీయులలొ
Num 4:47  ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు
Num 4:48  అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎని మిదివేల ఐదువందల ఎనుబదిమంది.
Num 4:49  యెహోవా నోటి మాట చొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతి వాడును తన తన సేవనుబట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతనివలన లెక్కింపబడిరి.

సంఖ్యాకాండము 5

Num 5:1  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
Num 5:2  ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.
Num 5:3  నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్ట వలెను.
Num 5:4  ఇశ్రాయేలీయులు ఆలాగు చేసిరి; పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి.
Num 5:5  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవి చ్చెను నీవు ఇశ్రాయేలీయులతో
Num 5:6  పురుషుడుగాని స్త్రీగాని యెహోవామీద తిరుగబడి మనుష్యులు చేయు పాపము లలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు
Num 5:7  వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను.
Num 5:8  ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేని యెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును.
Num 5:9  ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠిత మైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజ కుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును.
Num 5:10  ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చినయెడల అది అతని దగునని చెప్పుము.
Num 5:11  యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
Num 5:12  ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన యెడల
Num 5:13  ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేక పోయినను, ఆమె పట్టుబడకపోయినను,
Num 5:14  వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడిన యెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల,
Num 5:15  ఆ పురు షుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాప కముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము.
Num 5:16  అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను.
Num 5:17  తరువాత యాజ కుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను.
Num 5:18  తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్య మును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను.
Num 5:19  అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమ నగాఏ పురుషుడును నీతో శయనింపనియెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యముచేయక పోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్లనుండి నిర్దోషివి కమ్ము.
Num 5:20  నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడినయెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసిన యెడల
Num 5:21  యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక.
Num 5:22  శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్‌ అని చెప్పవలెను.
Num 5:23  తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి
Num 5:24  శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును.
Num 5:25  మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్య మును అల్లాడించి బలిపీఠము నొద్దకు దాని తేవలెను.
Num 5:26  తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్య ములోనుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాని దహించి
Num 5:27  ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పద ముగా నుండును.
Num 5:28  ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రు రాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగు నని చెప్పుము.
Num 5:29  రోషము విషయమైన విధియిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన యెడలనేమి,
Num 5:30  లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడినయెడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజ కుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను.
Num 5:31  అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.

సంఖ్యాకాండము 6

Num 6:1  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.
Num 6:2  పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించు కొనినయెడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను.
Num 6:3  ద్రాక్షా రసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండి నవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.
Num 6:4  అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు.
Num 6:5  అతడు నాజీ రగుటకు మ్రొక్కు కొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.
Num 6:6  అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.
Num 6:7  తన దేవునికి మీదు కట్ట బడిన తలవెండ్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరి గాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్ను తాను అప విత్రపరచుకొనవలదు.
Num 6:8  అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.
Num 6:9  ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడిన యెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవ దినమున తనతల గొరిగించుకొనవలెను.
Num 6:10  ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లల నైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నున్న యాజకునియొద్దకు తేవలెను.
Num 6:11  అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవ దానితో దహన బలిని అర్పించి, వాడు శవము ముట్టుటవలన పాపి యైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దిన మున వాని తలను పరిశుద్ధ పరపవలెను.
Num 6:12  మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి.
Num 6:13  నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరు వాత వానిగూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొని రావలెను.
Num 6:14  అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను, సమాధాన బలిగాను నిర్దోష మైన యొక పొట్టేలును,
Num 6:15  గంపెడు పొంగని పిండి, అనగా గోధమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణ ముగా యెహోవాయొద్దకు తేవలెను.
Num 6:16  అప్పుడు యాజ కుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను.
Num 6:17  యాజ కుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.
Num 6:18  అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించు కొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను.
Num 6:19  మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచవలెను.
Num 6:20  తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠిత మైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరు వాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును.
Num 6:21  మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.
Num 6:22  యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము
Num 6:23  మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.
Num 6:24  యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;
Num 6:25  యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;
Num 6:26  యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
Num 6:27  అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.

సంఖ్యాకాండము 7

Num 7:1  మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,
Num 7:2  దాని ఉపకరణములన్నిటిని బలి పీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబ ములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింప బడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి.
Num 7:3  వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడు బండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొని వచ్చిరి.
Num 7:4  అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు వారియొద్ద ఈ వస్తువులను తీసికొనుము;
Num 7:5  అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను.
Num 7:6  మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయుల కిచ్చెను.
Num 7:7  అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను.
Num 7:8  అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవచేయు మెరారీ యులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను.
Num 7:9  కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు.
Num 7:10  బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణ ములను తెచ్చిరి.
Num 7:11  బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెల విచ్చెను.
Num 7:12  మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమీ్మనాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.
Num 7:13  అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
Num 7:14  ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని
Num 7:15  దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱ పిల్లను
Num 7:16  అపరాధ పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
Num 7:17  సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము.
Num 7:18  రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడు నైన నెతనేలు.
Num 7:19  అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని
Num 7:20  ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని
Num 7:21  దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును
Num 7:22  ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను
Num 7:23  సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱ పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము.
Num 7:24  మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను
Num 7:25  నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
Num 7:26  ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును
Num 7:27  ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
Num 7:28  సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను
Num 7:29  అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము.
Num 7:30  నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదే యూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను
Num 7:31  డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
Num 7:32  ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును
Num 7:33  ఏడాది గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను
Num 7:34  సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడా దివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.
Num 7:35  ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము.
Num 7:36  అయిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీష దాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు. ఒ
Num 7:37  అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
Num 7:38  ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్నకోడెను
Num 7:39  ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను
Num 7:40  పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
Num 7:41  సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము.
Num 7:42  ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా.
Num 7:43  అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని
Num 7:44  ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని
Num 7:45  దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును ఏడాది గొఱ్ఱపిల్లను
Num 7:46  పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.
Num 7:47  ఇది దెయూ వేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము.
Num 7:48  ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా.
Num 7:49  అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని
Num 7:50  ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని
Num 7:51  దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేక పిల్లను
Num 7:52  సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను
Num 7:53  అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణ ముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీ షామా అర్పణము.
Num 7:54  ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదా సూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీ యేలు.
Num 7:55  అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని
Num 7:56  దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను
Num 7:57  అపరాధపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను
Num 7:58  అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.
Num 7:59  ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము.
Num 7:60  తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను.
Num 7:61  అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధమపిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది షెకెలుల బంగారు ధూపార్తిని
Num 7:62  దహనబలిగా ఒక చిన్న కోడెను
Num 7:63  ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను
Num 7:64  పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
Num 7:65  సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము.
Num 7:66  పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీష దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీ యెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి
Num 7:67  నూటముప్పది తులముల యెత్తు గల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని
Num 7:68  ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని
Num 7:69  దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను
Num 7:70  సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను
Num 7:71  అయిదు మేకపోతులను ఏడా దివి అయిదు గొఱ్ఱపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఆమీషదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము.
Num 7:72  పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.
Num 7:73  అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
Num 7:74  ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని
Num 7:75  దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును
Num 7:76  ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను
Num 7:77  సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము.
Num 7:78  పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర.
Num 7:79  అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
Num 7:80  ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తినిఒ దహనబలిగా ఒక చిన్నకోడెను
Num 7:81  ఒకపొట్టె లును ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను
Num 7:82  అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము.
Num 7:83  బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది.
Num 7:84  ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుధ్ద మైన తులపు పరిమాణ మునుబట్టి రెండు వేల నాలుగువందల తులములది.
Num 7:85  ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపా ర్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది.
Num 7:86  ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు,
Num 7:87  సమా ధానబలి పశువులన్నియు ఇరువది నాలుగు కోడెలు,
Num 7:88  పొట్టేళ్లు అరువది, మేకపోతులు అరువది, ఏడాదివైన గొఱ్ఱపిల్లలు అరువది.
Num 7:89  మోషే యెహోవాతో మాట లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.